తెలంగాణకు 26 వేల కోట్లు గ్రాంటు ఇస్తున్నట్లు కేంద్రం కీలక ప్రకటన చేసింది. మా ఎన్డీయే ప్రభుత్వం కేవలం తెలంగాణ కే 26 వేల కోట్లు గ్రాంటు ఈ ఏడాది వస్తుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన చేశారు. ఇవాళ మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ… యూపీఏ అధికారం లో ఉన్నప్పుడు బడ్జెట్ ప్రసంగం లో 2010 లో యూపీ, బీహార్ రెండు రాష్ట్రాలను మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఏపి తెలంగాణకు కలిపి 5-6 వేల కోట్లు మాత్రమే గ్రాంట్లు వచ్చాయన్నారు.
మా ఎన్డీయే ప్రభుత్వం కేవలం తెలంగాణ కే 26 వేల కోట్లు గ్రాంటు ఈ ఏడాది వస్తుందని.. 2004-2014 వరకు యుపిఎ ఎంత ఇచ్చిందని నిలదీశారు. 2014 నుంచి 2024 వరకు ఎన్డీయే ఎంత ఇచ్చింది చూడండని… నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు. తప్పులను సరిదిద్దుకోవాలని కోరారు. నీతి ఆయోగ్ మీటింగ్ కి ఎందుకు బహిష్కరణ ? గతం లో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ కేటాయింపులు తెలంగాణ కు కేంద్రం చేసిందని తెలిపారు. రాజకీయం చేయాలని అనుకుంటే ఎలా ఇప్పుడు అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలు లేవు… Brs వాళ్ళు ఇలానే చేస్తే వారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వారి స్థానం ఏంటో ప్రజలు చెప్పారని ఆగ్రహించారు.