ఇబ్రహీంపట్నంలో సీల్​లేని పోస్టల్ బ్యాలెట్లు.. ఆర్డీవో ఆఫీసు వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం కార్యాలయంలో భద్రపరిచిన పోస్టల్‌ బ్యాలెట్లకు సీలు లేకపోవడంపై కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్ధుల ఏజెంట్లు తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆర్డీవో అనంతరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్న డబ్బాల సీలు తొలగించారని ఆందోళనకు దిగారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పాస్‌లు కావాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన సమయంలో ఘటన జరిగింది. చాలా డబ్బాల సీళ్లు తొలగించారని ఒక దశలో ఆర్డీవో కార్యాలయంలోకి దూసుకుకెళ్లి.. అనంతరెడ్డిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనపై చర్యలు తీసుకుని.. సీలు ఎందుకు తెరిచారో తెలిపే దాకా… తాము కదిలేది లేదంటూ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పోలింగ్‌ పూర్తయినా పోస్టల్‌ బ్యాలెట్లు ఆర్డీవో కార్యాలయంలోనే ఎందుకు భద్రపరిచారని వారు ప్రశ్నించారు. ఈసీ మార్గదర్శకాలను పట్టించుకోకుండా RDO వ్యవహరించారని మండిపడ్డారు.  పోలీసులు పెద్దఎత్తున మోహరించి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news