తెలంగాణ సర్కార్ శుభవార్త.. ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్ లను సిద్ధం చేయనుంది. 26-70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్త పరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది.
NHMలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చనున్నాయి. ఇది ఇలా ఉండగా, కాలం గడుస్తున్నా కొద్దీ హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నూతన గృహ నిర్మాణాలు పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగ శాతం కూడా భారీగా పెరిగింది. పెద్ద మొత్తంలో కొత్త కరెంట్ కనెక్షన్లకు దరఖాస్తులు వస్తుండటంతో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది.