మహేష్ గౌడ్ కి పీసీసీ ఇవ్వడం సంతోషం : ఉత్తమ్

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షా బాధ్యతలు కాంగ్రెస్ అధిష్టానం మహేష్ గౌడ్ కి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నుండి ఆ బాధ్యతలు మహేష్ గౌడ్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. సామాజిక న్యాయంకి కట్టుబడి పార్టీ ఉందని అధిష్టానం నిరూపించింది. పార్టీలో సుదీర్ఘంగా పని చేస్తున్న వ్యక్తికి ప్చ్ ఇవ్వడం సంతోషం. ఇతర పార్టీల్లో ఒకే సామాజిక వర్గం కి అధ్యక్ష పదవి ఉంటుంది. కానీ కాంగ్రెస్ లోనే ఎవరికైనా పార్టీ బాధ్యతలు ఇస్తుంది అని అని ఉత్తమ్ పేర్కొన్నారు.

అలాగే మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం తోనే అధికారం వచ్చింది. కార్యకర్తల చెమట కష్టం అధికారంలోకి రావడం. ప్రస్తుతం మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నారు. సెప్టెంబర్ 17 నాడు విముక్తికి.. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర లేనే లేదు. కేవలం కాంగ్రెస్ పాత్ర మాత్రమే ఉంది. అసలు బీజేపీకి…సెప్టెంబర్ 17కి ఏం సంబంధం అని ఉత్తమ్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version