ప్రాజెక్ట్ ల రక్షణలో రాజీ పడొద్దు..!

-

నీటి పారుదల ప్రాజెక్ట్ లలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. నీటిపారుదల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రాజెక్ట్ ల పుడికతీత కేంద్రం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చిన సమయంలో పర్యావరణ అనుమతులు అవసరం లేదు అని స్పష్టం చేసింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మనం అందుకు అనుగుణంగా ముందుకు పోదాం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు పోదాం.

పూడికతీత అంశంపై నీటిపారుదల మరియు మైన్స్ & జియాలజీ విభాగాలు సమావేశమై ఒక నిర్ణయానికి రావాలి. ప్రాజెక్ట్ లకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా పూడిక తీత పనులు చేపట్టాలి. ప్రాజెక్ట్ ల రక్షణలో రాజీ పడొద్దు. పూడిక తీత సమయంలో సారవంతమైన మట్టి లభ్యత ఉంటే రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలి. అందుకు గాను రవాణా చార్జీలు రైతులే భరించే విధంగా విధి విధానాలు రూపొందించాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news