రేవంత్ రెడ్డికి సీఎం ఇస్తే ఒప్పుకోము..తేల్చిచెప్పిన కాంగ్రెస్‌ సీనియర్లు ?

-

రేవంత్ రెడ్డి సీఎం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం అందుతోంది. శ్రీధర్ బాబు కు స్పీకర్ ఇస్తాను అనడంతో… నేను ఖాళీగా అయినా ఉంటాను కానీ నాకు అవసరం లేదు అంటూ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే నాకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలి…వేరే ఎవరికి ఇచ్చిన ఒప్పుకొనే ప్రసక్తి లేదు అంటూ భట్టి విక్రమార్కా ఆగ్రహం వ్యక్తం చేశారట. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారట రేవంత్ రెడ్డి. సీతక్క కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే లేదంటే తేల్చి చెప్పారట సీనియర్ నేతలు. పౌరుష పదజాలంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారట సీనియర్ నేతలు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పరిణామాలు మారిపోయాయి. ఈ తరుణంలోనే ఢిల్లీకి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్క పయనం అయ్యారు. దీంతో ఇవాళ సాయంత్రం తెలంగాణ సీఎం ఎంపికపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version