మొదటినుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్లకి అన్యాయం జరిగింది – ఉత్తమ్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు ప్రారంభించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు తదితర నేతలు సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటినుంచి కాంగ్రెస్ లో ఉన్నవారికి అన్యాయం జరిగిందన్నారు. కొత్త కమిటీలలో టిడిపి నుంచి వచ్చిన 50 నుంచి 60 మందికి చోటు కల్పించాలని మండిపడ్డారు.

దీనిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు ఉత్తమ్. సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తామని అన్నారు. కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీలను ప్రకటించారని విమర్శించారు. మేము పుట్టుక నుండి చావు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే వాళ్లమని.. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం మేమే అన్నారు ఉత్తమ్. నేనే ఉండాలి.. నా వల్లే ఉండాలి అని మేము ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇది మంచి పద్ధతి కాదని.. దీని గురించి త్వరలోనే అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version