త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని…దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటీవల గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పథకం లో భాగంగా ఈరోజు పౌర శాఖ అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు.

uttam on ration cards

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక కేజీ రేషన్ బియ్యానికి 39 రూపాయల ఖర్చు భరిస్తుందని చెప్పాడు. అలాగే ప్రభుత్వం నెలకు 1.81 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుండగా అందులో 90% ఎవరు ఆ బియ్యాన్ని తినడం లేదని తెలిపారు.

కొందరు డీలర్లు ఆ బియ్యాన్ని రీసైకిల్ చేసి పౌల్ట్రీ బీర్ల కంపెనీలకు తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాగా… తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాలను పొందాలంటే ఈ రేషన్ కార్డులు తప్పనిసరి. వీటి కోసం తెలంగాణలోని చాలామంది సామాన్య ప్రజలు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల నుంచి అంటే 2014 నుంచి ఇంతవరకు గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేకపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news