హైదరాబాద్ లోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు పోలీసులు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో గణనాథులు బార్లు తీరాయి. బషీర్బాగ్, అబిడ్స్, లకిడికపూల్ వరుకు బార్లు తీరాయి గణనాధులు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే 7174 గణనాధుని నిమర్జనం చేశారు అధికారులు.
అటు నారాయణగూడ, బషీర్ బాగ్, సెక్రటేరియట్, లకిడికపుల్, ట్యాన్క్ బండ్, రాణిగంజ్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆఫీసులకు, స్కూల్స్ ఇతర పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురౌవుతోంది. నిమజ్జనానికి ఇంకా వేలాది విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది.
సంజీవయ్య పార్క్ వద్ద మైనర్ యువకుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు గణనాథుని తీసుకొని వస్తున్న లారీ టైర్ కింద పడి మృతి చెందాడు యువకుడు. అటు బైక్ పై నుంచి కిందపడ్డ నాలుగేళ్ళ బాబుపై నుంచి టస్కర్ వాహనం వెళ్లింది. నీలోఫర్ లో చికిత్స పొందుతూ ఆ నాలుగేళ్ళ బాలుడు ఆయుష్ చనిపోయాడు.