భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం..ఆర్జిత సేవలు రద్దు

-

 

Vemulawada Rajanna : వేములవాడ రాజన్న క్షేత్రానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ఠ్. ఇవాళ సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది వేములవాడ రాజన్న క్షేత్రం. ఇవాళ తెల్లవారు జామునుండే క్యూ లైన్ లో రాజన్న భక్తులు బార్లు తీరారు. దీంతో వేములవాడ రాజన్న స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అయితే… వేములవాడ రాజన్నభక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు.

Vemulawada Rajanna Kshetra which is jammed with devotees

భక్తులకు లఘు దర్శనానికి అనుమతి ఇచ్చారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే..సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళ్లే ముందు… మొదటగా వేములవాడ రాజన్న క్షేత్రానికి రావడం ఆనవాయితీ. వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే…సమ్మక్క-సారలమ్మ జాతరలకు వెళతారు జనాలు. ఈ తరుణంలోనే.. జనవరి మాసం నుంచే వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news