వేములవాడ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారిపోయాయి. బీజేపీ వైపు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఈటల రాజేందర్ తో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న జర్మనీ నుంచి వేములవాడకు రానున్నారు చెన్నమనేని. వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా రమేష్ బాబును నిలబెట్టాలనే యోచనను బీజేపీ అధిష్ఠానానికి ఇప్పటికే తెలియజేశారట ఈటల.
బీఆర్ఎస్ లో ఉంటూ చల్మెడకు సహకరించేదేలేదన్న పట్టులో రమేష్ బాబు..నిన్న తన భావోద్వేగం, నిర్వేదంతో కూడిన సోషల్ మీడియా పోస్టుకనుగుణంగా టిక్కెట్ దక్కకపోవడంపై మనస్థాపం వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ వైపు చూస్తున్నారట రమేష్ బాబు. ఇక మరోవైపు ఈనెల 30న బీజేపీలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు చేరనున్నారు.వికాస్ రావు కూడా బీజేపీ వేముల వాడ అభ్యర్థిగా రానున్నట్లు సమాచారం.