నాగ చైతన్య… నాకు గిఫ్ట్ కావాలి: వేణు స్వామి భార్య డిమాండ్

-

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య – శోభిత ధూళిపాళ వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవదంటూ వేణుస్వామి జ్యోష్యం చెప్పిన విషయం తెలిసిందే. అంతకుముందు కూడా సెలబ్రిటీల జాతకం చెబుతూ వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 22న వివరణ ఇవ్వాలని వేణుస్వామిని మహిళా కమిషన్ ఆదేశించింది.

అయితే దీనిపై వేణుస్వామి వీణ స్పందించారు. ఇప్పటికే తన భర్తపై మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఇక తాజాగా ఆమె మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో నాగచైతన్యకు ఓ రిక్వెస్ట్ పెట్టారు. ఇటీవలే ఎంగేజ్మెంట్ జరుపుకున్న చై-శోభితలకు శుభాకాంక్షలు చెబుతూ.. నాగచైతన్యను తనకు ఓ బ్యాగ్ (louis vuitton) కొనివ్వాలని డిమాండ్ చేశారు వీణ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యామిలీ అంతా ఇంతేనా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version