ఎండాకాలంలో చాలా మంది లైట్ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో సూప్ కూడా ఒకటి. సూప్‌లను ఏ కాలంలోనైనా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. టేస్ట్‌కు తగ్గట్లు సూప్‌లను ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. మార్కెట్‌లో సూప్ షాపులు తక్కువగా ఉన్నా.. వాటికి డిమాండ్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తాయి. అయితే ఇంట్లోనే ఉంటూ 4 రుచికరమైన సూప్ల తయారీ విధానాన్ని మనం తెలుసుకుందాం. టమాట సూప్, మొక్కజొన్న సూప్, పుట్టగొడుగు సూప్, టామ్ యమ్ సూప్, హాట్ అండ్ సోర్ సూప్ వంటి అనేక సూప్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ సమయంలో మంచి సూప్ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
పుట్టగొడుగు సూప్..
పుట్టగొడుగు సూప్ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఓ పాత్ర తీసుకోవాలి. అందులో లీక్స్, సెలెరీ, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. అందులో 1 కప్పు పుట్టగొడుగులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 కప్పుల కూరగాయల స్టాక్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, నీళ్లు కలిపి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. బాగా ఉడికిన మిశ్రమాన్ని కలుపుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు వేసుకోవాలి. అంతే వేడి వేడి పుట్టగొడుగు సూప్ రెడీ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు తిండే చాలా బాగుంటుంది.
టమాట సూప్..
టమాట సూప్ తయారీకి కొద్దిగా తరిగిన ఉల్లిపాయ, సెలెరీ, క్యారెట్లు, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్ మిశ్రమంలో వేయించాలి. అందులో 2-3 టమాటలు లేదా 3 టేబుల్ స్పూన్ల టమాట తరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు మిరియాలు వేసుకోవాలి. 7 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికించి సూప్‌లా మిక్స్ చేసుకోవాలి. అంతే టమాట సూప్ రెడీ. వేడిగా ఉన్నప్పుడే టమాట సూప్ టేస్ట్ చేయాలి.
మొక్కజొన్న సూప్..
ఒక బౌల్‌లో 1 కప్పు మొక్కజొన్న, 2 కప్పుల కూరగాయల మిశ్రమం (ఉల్లిపాయలు, సెలరీ, క్యారెట్లు, వెల్లుల్లి, నూనెతో తయారు చేసిన మిశ్రమం) కలిపి 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బాణలిలో కొద్దిగా తరిగిన ఉల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ మిసో, ముందుగా ఉడికించిన మిశ్రమాన్ని వేసి కొద్ది సేపటి వరకు ఉడికించాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు వేసి కిందికి దించుకోవాలి. అంతే మొక్కజొన్న సూప్ రెడీ.
బంగాళాదుంప సూప్..
ఒక బౌల్‌లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడిగా అయిన తర్వాత కొద్దిగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒకటిన్నర కప్పు తరిగిన బంగాళాదుంప, 1 కప్పు పాలు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 7 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. బాగా ఉడికిన మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని మరోసారి 2 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. సరిపడా నీరు, ఉప్పు, మిరియాలు కలిపితే సరిపోతుంది.