ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వీహెచ్ స్ట్రాంగ్ కౌంటర్..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కి కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని.. అప్పట్లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీరు గెలిచినప్పుడు ఎంతమంది ని మీ పార్టీలోకి లాక్కున్నారో గుర్తు తెచ్చుకోండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఈ బుద్ధి ఏమైంది..? టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని బీఆర్ఎస్ లోకి చేర్చుకున్న విషయం మర్చిపోయారా..? ఆయనకు మంత్రి పదవీ కూడా ఇచ్చిన విషయం గుర్తుందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే ఏదో అన్యాయం జరిగినట్లు గగ్గోలు పెడుతున్నారని.. ఇది మొదలు పెట్టింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. ఎవరు చేసిన పాపం వాళ్లకి కచ్చితంగా తిరిగి తగులుతుందంటే ఇదేనని, తప్పు చేసినోడికి కొంచెం ఖుషీగా ఉంటది.  కానీ  బాధపడ్డోడు అది మర్చిపోడని గుర్తుకు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version