మాజీ సీఎం జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడు జైలులో ఉన్నట్లు నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారని పేర్కొన్నారు. దాదాపు పది రోజుల నుంచి సీఎం చంద్రబాబు విజయవాడ లోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో వరదలు వచ్చి అతలకుతలమైపోతుంటే.. వాటి గురించి జగన్ పట్టించుకోలేదన్నారు.
సీఎం చంద్రబాబు చొరువ తీసుకొని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని వెల్లడించారు. విపత్తుల సమయంలో దాదాపు అందరూ సహాయం చేస్తున్నారు. కానీ వైసీపీ సహాయం అటు పెడితే.. వాళ్లు మాత్రం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. బ్యారేజీని పడవలతో కూల్చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నారని పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ కు రాజకీయాలు కావాల్సి వచ్చిందా..? అని ప్రశ్నించారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ప్రజలకు అవసరమైన సమయంలో కూటమి ప్రభుత్వం తప్పకుండా సహాయం చేస్తుందని ఈ వరదలతోనే ప్రూవ్ అయిందని వెల్లడించారు మంత్రి.