మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజీ.. 6, 8 బ్లాక్‌లలోని ఇతర పియర్స్‌కూ నష్టం

-

మేడిగడ్డ బ్యారేజీలో తవ్విన కొద్ది సమస్యలు బయటపడుతున్నాయి అంటున్నాయి దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్గాలు. ఏడో బ్లాక్‌లోనే కాకుండా 6, 8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు తెలిపాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దాటి కొట్టుకుపోయాయని చెప్పాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, పియర్స్‌ భారీగా దెబ్బతినడానికి నాణ్యత, నిర్వహణ లోపాలతోపాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లు విజిలెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

మొదట గుర్తించిన పియర్స్‌ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పియర్స్‌ బీటలు వారినట్లు మాత్రమే వెలుగులోకి రాగా, తాజాగా విజిలెన్స్‌ దర్యాప్తులో భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు సమాచారం. సమస్య తీవ్రత.. అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని విజిలెన్స్ వర్గాలు చెబుతున్నాయి. డిజైన్‌లో కూడా లోపాలు ఉన్నాయని, లాగ్‌బుక్‌, కాంక్రీటు మిక్సింగ్‌, నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అన్నీ లేవని సంబంధిత ఇంజినీర్లు వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news