పార్టీ మారడంపై వస్తున్న విమర్శలపై విజయశాంతి రియాక్షన్​

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ పార్టీ జంపింగులు ఎక్కువయ్యాయి. టికెట్ ఆశించిన ఆశావహులు తమకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారికి మరో అవకాశం కూడా ఇవ్వడానికి అధిష్ఠానం మొగ్గుచూపకపోవడంతో పార్టీలు మారుతున్నారు. ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య జంపింగులు ఎక్కువయ్యాయి. ఇటీవల బీజేపీ నుంచి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆమె పార్టీ మారడంపై సర్వత్రా విమర్శలు రావడంతో తాజాగా ఆమె స్పందించారు.

రాష్ట్రంలోని దుర్మార్గ పాలన పోవాలని, తాము కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ బాగుంటే చాలు అన్నఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి తాను సహా మరికొందరు నేతలు పార్టీలో చేరినట్లు విజయశాంతి తెలిపారు. కానీ బీజేపీ మాట నిలబెట్టుకోక తమను మోసగించిందని అన్నారు. బీఆర్ఎస్​తో బీజేపీ అవగాహన పెట్టుకున్నట్లు తెలిసిన తరువాతనే ఇంత మంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెళ్లారని ఆరోపించారు. విమర్శలు చేయడం తేలికగా ఉన్నప్పటికీ…ఆత్మ పరిశీలన చేసుకోవడం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version