బండి సంజయ్‌ని మార్చడం వల్లే..బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత విజయశాంతి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని విజయశాంతి విమర్శలు చేశారు. ఇవాళ మీడియాతో విజయశాంతి మాట్లాడు తూ..బీజేపీ.. బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అని అర్థం అయ్యిందని…తెర ముందు ఒకటి.. తెర వెనుక ఒకటి మట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ… కార్యకర్తలు.. నాయకులను మోసం చేస్తుందని..నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహించారు.
బండి సంజయ్ ని.. మార్చిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాటిన విత్తనం బీజేపీలో..సంజయ్ ని మార్చేసిందన్నారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి..కేసు ఏమైంది అని ప్రశ్నించారు. ఆలోచించండి…బీజేపీ పార్టీని వాళ్లకు వాళ్ళే నాశనం చేసుకున్నారని విమర్శలు చేశారు. నన్ను తిట్టే హక్కు బీజేపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు విజయశాంతి. సీఎం కేసీఆర్ ఇచ్చే డబ్బుకోసం పని చేసే వ్యక్తిని కాదన్నారు రాములమ్మ. అద్వానీ నాకు గురువు.. ఆయన మాకు సంస్కారం నేర్పారని బీజేపీ నేతలకు చురకలు అంటించారు విజయశాంతి.