సీఎం కేసీఆర్ 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టడంపై రాములమ్మ ఫైర్ అయ్యారు. కేసీఆర్ గారు గాంధీ మహాత్మునితో సమానం. ఆచరించనిది చెప్పొద్దనే సిద్ధాంతంలాగా కనీసం ఈ ఊక ప్రకటనలలో వర్షాలచ్చినా… వరదలచ్చినా… తెలంగాణ ఆగమైనా ఎన్నడూ ఇల్లు కదిలి జన ప్రజలను దేఖని ఈ ముఖ్యమంత్రి, ఇయ్యాల తన లెక్కనే ప్రజలను ఇల్లు కదలద్దంటున్నరు. కారణం ఏదైనా… ఈ సీఎం గారి బంగారు తెలంగాణలో వర్షం వచ్చినప్పుడల్లా వాన నీటికి కనిపించని గుంతల్లో లేదా నల్లాల్లో ప్రమాదవశాత్తు ఎవరేమైపోతారో తెలియక వెదుక్కోవలసిన పరిస్థితిని ఎన్నిసార్లుగా చూస్తున్నామో ప్రజలకు బాగా తెలుసు అని కౌంటర్ వేశారు.
అయితే, గతంలో ఎప్పుడూ ఇంత మాట్లాడని కేసీఆర్ గారు…. కనీసం ఇయ్యాల బీజేపీ భయంతో తన చేసిన అవకతవకల పరిపాలన వల్ల జనం ప్రాణాలు పొయ్యే పరిస్థితి ఉన్నదని ఒప్పుకుని, స్వయంగా డేంజర్ సైరన్ ఊదినట్టు… మందిని బయటికెల్లొద్దు… మేం గ్యారెంటీ కాదు అని స్పష్టంగా చెప్పేశారు. తన పాలనలో లోపాలు బయటపడే ప్రమాదం ముంచుకొచ్చినప్పుడల్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి… తన పక్కలో బల్లెంలా మారి నిలదీస్తున్న బీజేపీ మీద నిందల బురదజల్లి… ప్రజలకు తన వల్లే మేలు జరుగుతుందని బిల్డప్ ఇవ్వడం రాష్ట్ర పౌరులకు కొత్తేమీ కాదు. ఉద్యోగులకు పెంచిన పిఆర్సీ బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేక…. వాళ్ళు రిటైర్మెంట్ సమయంలో బాకీలు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించడమేగాక అసలు ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పనపై కేంద్రాన్ని విమర్శించే ఈ సీఎం పాలనలోనే ఉద్యోగాల కోసం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో… బీమా ప్రీమియం కట్టక, కొనుగోలు కేంద్రాలు పెట్టక, ఇంకా అనేక ఇబ్బందులు సృష్టించి రైతుల్ని ఎంత కష్టపెట్టిండో లెక్కలు తీస్తే ఆయనకే సిగ్గుపోతది. ఓ పక్క భారీ వర్షలతో జనం చస్తుంటే… ఈ విపత్తు సమయంలో రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించడం మానేసి, 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడ్డం ఈ పెద్దమనిషికే చెల్లింది. ఇండియా మొత్తం మీద వెదికినా ఇలాంటి ఆణిముత్యం లాంటి సీఎం దొరకడని మండిపడ్డారు విజయశాంతి.