ఏం కేసీఆర్… అసెంబ్లీ న‌డిపించే ప‌ద్ద‌తి ఇదేనా – విజ‌య‌శాంతి

-

ఏం కేసీఆర్… అసెంబ్లీ న‌డిపించే ప‌ద్ద‌తి ఇదేనా అని ఫైర్‌ అయ్యారు బీజేపీ నేత విజ‌య‌శాంతి. కేంద్రాన్ని బద్నాం చేయడానికే అసెంబ్లీలో కేసీఆర్ స‌ర్కార్ చర్చలు పెడుతున్నది. సభలో అసలు విషయాలు మాట్లాడకుండా… కేంద్రాన్ని టార్గెట్ చేసేలా ప్రసంగం చేయడం వెనక ఉద్దేశం ఏమిటో తెలుస్తూనే ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కీలక సమస్యలపై కనీస ప్రస్తావన కూడా లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయన్నారు.

తొలి రోజు ఆరు నిమిషాలకే సభ వాయిదా పడగా… మిగతా రెండు రోజులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతోనే సరిపోయింది. దీంతో ఐదు నెలల తర్వాత సమావేశమైన అసెంబ్లీలో కీలకమైన సమస్యలపై చర్చనేదే లేకుండా పోయింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ని రద్దు చేయటంతో సమస్యలను ప్రస్తావించకుండానే స‌భ వాయిదా ప‌డింది. మూడో రోజున సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. ఏం కేసీఆర్… స‌భ‌ను న‌డిపించే ప‌ద్ద‌తి ఇదేనా..! తెలంగాణ‌ను ఆగం చేస్తున్న కేసీఆర్ స‌ర్కార్‌కు రాష్ట్ర ప్ర‌జలు త్వరలోనే త‌గిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version