మునుగోడులో ఇంత దిక్కుమాలిన రాజకీయమా…? – విజయశాంతి

-

ఇంత దిక్కుమాలిన రాజకీయమా…?అని కేసీఆర్‌ సర్కార్‌ పై విజయశాంతి విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో అత్యంత నీచ రాజకీయాన్ని చేస్తోంది. గెలవడమే పరమావధిగా పెట్టుకున్న టీఆర్ఎస్ మునుగోడులో చిత్రవిచిత్రమైన వేషాలు వేస్తోందని మండిపడ్డారు.

అక్కడ ఒకవైపు డబ్బు, మద్యం పంచుతూ ప్రజలను ప్రలోభాలకు గురించి చేస్తూనే.. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సమాధిని ఈ టీఆర్ఎస్ నాయకులు కట్టారు.

టీఆర్ఎస్ నాయకుల్లారా మీకు కాస్తాయినా సిగ్గుందా? విమర్శలకైనా కొంచెం హద్దు ఉండాలి. ఏం చేసినా కాస్త పద్ధతిగా మెలగాలి. మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి సమాధి కట్టడం ఎంతవరకు సమంజసం? ఆ సమాధి జేపీ నడ్డా గారిది కాదు, అది బిజెపికి మునుగోడులో గెలుపు పునాది కాబోతోంది. ఇదంతా చూస్తూ ప్రజలు ఊరుకోరు. ఈ ప్రజానీకమే మీకు తెలంగాణలో బొంద పెట్టి సమాధి కట్టడం ఖాయమని హెచ్చరించారు విజయ శాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version