రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయని బీజేపీ పార్టీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విజయశాంతి. ఈ మధ్య కొందరు నాయకులు రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప అంటున్నారు…అది నిజమన్నారు విజయశాంతి. ఎందుకంటే, పార్టీ కార్యకర్తలు కూడా అదే విశ్వాసంతో ఉండాలి కాబట్టి…అంటూ ఆస్తకి కర వ్యాఖ్యలు చేశారు.

పార్టీల ఎపుడైనా కొన్ని కారణాల వల్ల, పార్టీ ప్రయోజనాలు హత్యకు గురి చేయబడ్డ ప్రయత్నాలు ఆగుపడ్డా, కార్యకర్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ఆత్మ విధాన ప్రేరేపిత లక్ష్యంతో ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలి, కాబట్టి అంటూ విజయశాంతి వెల్లడించారు బీజేపీ పార్టీ నేత విజయశాంతి. అయితే, రాజకీయంగా పార్టీ ప్రయోజనాల హత్యలే ఉంటున్నప్పుడు, అవి కార్యకర్తలకు ఆత్మహత్యా సదృశ్యంగా గోచరిస్తున్నప్పుడు, కార్యకర్తలకు ఏమి దిశా నిర్దేశం చెయ్యాలో కూడా ఆ పై నేతలే చెప్పాలి మరి అంటూ కౌంటర్లు పేల్చారు బీజేపీ పార్టీ నేత విజయశాంతి.