న్యాయ వ్యవస్థపై జగన్ చేసినంత దరిద్రమైన వ్యాఖ్యలు మరెవరు చేయలేదు – రఘురామ

-

దేశ చరిత్రలోనే న్యాయ వ్యవస్థలపై పులివెందులవాసి, ఏడుగురి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు చేసినంత దరిద్రమైన వ్యాఖ్యలు మరెవరు చేయలేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా కొంత మంది చేసిన వ్యాఖ్యలపై జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించడం శుభ పరిణామం అని, ఇదే విషయంపై న్యాయస్థానంలో అడ్వకేట్ జనరల్ ఒక పిటిషన్ దాఖలు చేశారని, న్యాయమూర్తులపై వ్యక్తిగత వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు.

కోర్టు ధిక్కరణపై 1971 సెక్షన్ 10 ప్రకారం కన్ స్ట్రక్టివ్ క్రిటిసిజం టు ఇంప్రూవ్ ది సిస్టం అని పేర్కొనడం జరిగిందని అన్నారు. వ్యక్తిగత దూషణలు మంచివి కావని, ప్రతి ఒక్కరూ నిగ్రహం పాటించాలని, ఎవరు కూడా అటువంటి చర్యలకు దిగవద్దని, లోయర్ కోర్టు కాకపోతే, హైకోర్టులో… అక్కడ కాదంటే సుప్రీం కోర్టులో న్యాయం జరిగి తీరుతుందని, ఇదే విషయాన్ని తాను పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నానని గుర్తు చేశారు. గతంలో న్యాయమూర్తుల గురించి, న్యాయ వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.

అయితే అమెరికాలో కొందరు, ఇక్కడున్న మరి కొంత మంది ఎంపీలపై కేసులు నమోదైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కోర్టు ధిక్కరణ అనేది అత్యంత దారుణమైన తప్పు అని, 2020 అక్టోబర్ ఆరవ తేదీ లేదంటే 10వ తేదీన మూడేళ్ల క్రితం తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ గురించి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఎన్వి రమణ గారిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని, అప్పటికే సుప్రీంకోర్టులో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఎన్వి రమణ గారిపై దరిద్రమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news