Vijayashanti : బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి

-

బీజేపీ పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్‌ రెడ్డికి పంపించారు విజయశాంతి. అలాగే… సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు రాములమ్మ. తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదేనని వివరించారు.

Vijayashanti resigned from BJP
Vijayashanti resigned from BJP

కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరన్నారు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం అని వివరించారు. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుంచి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంత మాత్రం సరికాదని ఫైర్‌ అయ్యారు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నదన్నారు. అట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news