రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు బిజెపి నేత విజయశాంతి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. హెల్మెట్ వాడుతూ, వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపాలని.. సురక్షితంగా మీ గమ్మే స్థానాలకు చేరుకోవాలని కోరుతూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
” డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరికి విన్నపం. దసరా పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక.. ఈ భూమిపై మరో జన్మ పొందడానికి తల్లి గర్భంలో 9 నెలలు వేచి చూడాలి. నడవడానికి రెండు సంవత్సరాలు, ఓటు హక్కు కై 18 సంవత్సరాలు. ఉద్యోగం కోసం 25 సంవత్సరాలు. ఇలా ఎన్నో సందర్భాలలో వేచి ఉంటాము. కానీ ఓవర్టేక్ చేసే సమయంలో, వాహనాలు నడుపుతున్నప్పుడు 30 సెకండ్లు కూడా ఆగలేక పోతున్నాము.
తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు, వారాలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి. కొన్ని సెకండ్ల గడబిడ ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు ఆలోచించండి. ముందు వెళ్లేవాడు వెళ్ళని.. వెనకాల హాయిగా వెళ్ళిపో. దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, హెల్మెట్ వాడుతూ వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి, మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి. మీకోసం.. మీ యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు మీ ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటారని మరువకండి. దసరా శుభాకాంక్షలు” అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.