కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ వరుస ప్రెస్ మీట్లు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే.. మరోవైపు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఊరూరా తిరుగుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం బీఆర్ఎస్ నేత నుంచే వినోద్ కుమార్ ప్రచారం మొదలు పెట్టారు. ఇవాళ ఉదయాన్నే ఆయన వేములవాడ పట్టణంలో మార్నింగ్ వాకర్స్‌తోమాట్లాడారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రధాన మంత్రిగా ఉన్న మోదీ మత వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం దారుణమని వినోద్ కుమార్ అన్నారు. మోదీ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. మరోవైపు గత ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు బండి సంజయ్కు ఓటేస్తే ఈ ఐదేళ్లలో ఆయన జిల్లాకు చేసిందేం లేదని మండిపడ్డారు. అందుకే ఈసారి బండికి ఓటేయొద్దని కారు గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.