రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్. రేపు ఉదయం 8:15 కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొనున్న సీఎం జగన్… కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు చేరుకోనున్నారు.

పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్ లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన నున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. పులివెందుల నుంచి కడపకు చేరుకొని కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.