ఈ కేబినెట్ భేటీలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలి : వినోద్ కుమార్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీపై కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రైతు బంధు పథకం గురించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు.

“ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం ఉంటుందని అంటున్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. రైతు బంధు పథకం గురించి కేబినెట్ భేటీలో చర్చించాలి. ప్రధానమంత్రితో సహా చాలా మంది రైతు బంధు పథకాన్ని స్వాగతించారు. పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి రైతు బంధు. రోహిణి కార్తె సమయంలో పెట్టుబడి కోసం రైతులు తిరుగుతారు. పంట కోతల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు. రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.” అని వినోద్ కుమార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news