కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ ఎంపీ వివేక్?

-

బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ లోకి వెళుతున్నట్లు సమాచారం అందుతోంది. బిజెపి నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

వివేక్ ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. వివేక్ కాంగ్రెస్ లో చేరుతారంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహగానాలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్లు అయింది. మరోవైపు బిజెపి చెన్నూరు టికెట్ ను వివేక్ కు కేటాయించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ రెండవ జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు. బోథ్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే బాపురావు స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్, ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రామ్ రెడ్డి, మహేశ్వరం టికెట్ రాకపోవడంతో నరసింహారెడ్డి, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, మునుగోడులో ఇండిపెండెంట్ ఆ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు చలమల కృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news