ప్రతిపక్షాల మాయలో ఓటర్లు పడొద్దు : సీఎం కేసీఆర్

-

భైంసా ప్రజా ఆశీర్వాద సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. గోదావరి నదికి తెలంగాణలో పుస్కరాలు లేవు. తెలంగాణ ఉద్యమం సమయంలో తాను కొట్లాడితే.. తెలంగాణలో గోదావరి పుష్కరాలు వచ్చాయని తెలిపారు సీఎం కేసీఆర్. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా నా మాట నమ్మండి. ఓటును సరైన పార్టీకి వేస్తే భవిష్యత్ సరైన పద్దతిలో ఉంటుంది. అనవసరంగా ప్రతిపక్షాల మాయలో ఓటర్లు పడొద్దు. ప్రజలు పార్టీల చరిత్ర చూడాలి. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని తెలిపారు. మేము చేసిన అభివృద్ధి కంటికి కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా అబద్దాలు, గాలి మాటలు చెబుతున్నాయి. ప్రజలను ఆగమాగం చేయాలని చూస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరో ప్రజలు పరిశీలించాలని సూచించారు.


మహారాష్ట్ర రైతులు తెలంగాణలో బోర్లు వేసి మహారాష్ట్రలో పంటలు పండిస్తున్నారు. మహారాష్ట్రలో తెలంగాణ ఎంత దూరం ఉందంటే.. ఎక్కడ రోడ్డు నున్నగా ఉందో.. అక్కడి నుంచే తెలంగాణ అని చెబుతుంటారు. ఇటు మహారాష్ట్ర అయినా.. అటు ఆంధ్రప్రదేశ్ అయినా అదే పరిస్థితి. తెలంగాణ బాగుపడాలంటే బీఆర్ఎస్ కి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version