వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ పెద్ది స్వప్నకి దాదాపు ఖరారు?

-

Warangal BRS MP ticket for Peddi Swapna: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి రాజీనామా గులాబీ పార్టీకి పెద్ద తలనొప్పులు తీసుకువచ్చింది. ఇచ్చిన టికెట్ కాదని కాంగ్రెస్లో చేరారు కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు. దీంతో వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచన చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.

Warangal BRS MP ticket almost finalized for Peddi Swapna

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పెద్ది స్వప్న ను ఫైనల్ చేసేందుకు సిద్ధమయ్యారట. పెద్ది సప్న ఎవరో కాదు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య. పెద్ది స్వప్న కూడా ఎస్సీ మాల సమాజక వర్గానికి చెందినవారు. వరంగల్ ఎంపీ టికెట్ కూడా దళితులకు కచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెళ్లి స్వప్నకు ఇచ్చేందుకు కెసిఆర్ రంగం సిద్ధం చేశారట. కాంగ్రెస్ అభ్యర్థి మహిళా కావడంతో… వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మరో మహిళ నే దించాలని కెసిఆర్ భావించారట. అందుకే స్వప్నను ఫైనల్ చేసినట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news