నేడు 7వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్

-

సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు కొనసాగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు ఉంటుంది. ఇక ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.

Today is the 7th day of CM Jagan’s bus trip schedule

సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం తేనెపల్లిలో భోజన విరామం ఉంటుంది. తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ సమీపంలో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లెలో రాత్రి బసకు చేరుకోనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news