కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటితో పాటు పలువురు నేతలుసీఈఓ వికాస్ రాజ్ ను కలిసి పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధణలు పాటించలేదని.. రైతుబంధుకు సంబంధించిన రూ.6వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్ కి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఈసీకి విన్నవించారు. ధరణీ పోర్టల్ లో అసైన్డ్ భూముల రికార్డులను మార్చకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో ఉన్నటువంటి అసైన్డ్ భూములను మార్చుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ దిగిపోయే ముందు రూ.6వేల కోట్లను కాంట్రాకర్లకు ఇచ్చే ప్రయత్నంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు కేసీఆర్ యత్నం చేస్తున్నట్టు కూడా తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 04వ తేదీగా జరుగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు.