సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని కొందరూ కుట్ర చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. లగచర్ల ఘటన వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీలు నెరవేర్చాకే 2028 ఎన్నికల్లో మళ్లీ ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రాస్ట్ర ప్రతిస్టను దెబ్బతీయవద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని స్పస్టం చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా ప్రాజెక్టులు తెలంగాణకు మంజూరు చేసింది అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. డీలిమిటేషన్ వివాదం పై వాదనలు డీలిమిటేషన్ అంశం పై రాహుల్ గాంధీ తన స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా మంత్రి శ్రీధర్ బాబు, డీలిమిటేషన్ పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ నిర్ణయం చెప్పాలని సవాల్ విసిరారు.