పిఠాపురం అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇకపై వరుసగా సమీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషి అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్ మెంట్ అధికారులతో ఈరోజు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు పవన్. అధికారులతో రివ్యూలో కీలక సూచనలను చేవారు. పిఠాపురం నియోజకవర్గ పరిదిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితి పై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారుల మూలంగా పోలీస్ శాఖ చులకన అవుతోందన్న ఆయన ప్రతివారం పిఠాపురం అబివృద్ది పై సమీక్ష చేస్తానని తెలిపారు.
అధికారుల క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల పరిరక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండకూడదు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేవానని తెలిపారు.