రాష్ట్రంలో బుల్డోజర్ పాలన తీసుకొస్తాం : బండి సంజయ్

-

రాష్ట్రంలో బుల్డోజర్ పాలన తీసుకొస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాషాయ పార్టీ కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. కులాలు,మతాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలన్నారు. అవినీతి చేసిన నేతలను జైలుకు పంపుతామని తెలిపారు. డిసెంబర్ 03న సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.

తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుటుంబ పాలన చేస్తున్నాయని.. కుటుంబ పాలన పోయి.. ప్రజల పాలన రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించాలన్నారు సంజయ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చాయో.. రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే బీజేపీకి అనుకూలంగా వస్తాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version