వీఐపీల డ్రైవర్స్ కి ఫిట్ నెస్ టెస్ట్ చేస్తాం : మంత్రి పొన్నం

-

వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్స్ కి ఫిట్ నెస్ టెస్ట్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.  తాజాగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ మహలక్ష్మీ కింద కండక్టర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో రెగ్యులర్ గా 44 లక్షల ప్రయాణాలుంటే.. ఇప్పుడు 55 లక్షలకు పైగా ఉంది. ఆటోవాళ్లకు రూ.12 వేలు హామీ ఇచ్చాం. అది తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. ఆటోలు కొనుగోలు పెరిగింది. ఆటోలకు నష్టం ఉంటే కొత్తవి ఎందుకు కొంటారు..? అని ప్రశ్నించారు.

కుల గణనపై అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు. బీహార్ లో 2.5లక్షల మంది అధికారులను కేటాయించి ఒక్కొక్కరికీ 150 ఇల్లు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి అధికారులను నియమిస్తామన్నారు. నోడల్ ఆఫీసర్ గా బీసీ వెల్పేర్ డిపార్టుమెంట్ ఉంటుంది. కవితకు సీబీఐ నోటీసులు వాయిదాల పద్దతితో వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. అందుకే మళ్లీ కొత్త డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version