తన విజయాన్ని అపడానికి తో కేసీఆర్, హరీష్ రావు చాలా కష్ట పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజక వర్గం లోని ప్రజలను ఎంత మభ్య పెట్టినా.. హుజురాబాద్ ప్రజలు కేసీఆర్, హరీష్ రావు లను నమ్మలేరని అన్నారు. అలాగే వీరికి హుజురాబాద్ ప్రజలు కర్రు కాచి వాత పెట్టారని అన్నారు. అయితే దళిత బందు పథకాన్ని రాష్ట్ర మంతా వర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులను తానే ఏకం చేస్తామని అన్నారు.
అంతే కాకుండా దళిత గర్జన సభ ను సిద్ధి పేట్ లో నిర్వహిస్తామని ఈటల రాజేందర్ ప్రకటించారు. ఈ సభ కు, దళితల ను ఐక్యం చేయడానికి తానే నాయకత్వం వహిస్తానని కూడా ప్రకటించారు. అనంతరం మంత్రి హరిష్ రావు పై నిప్పులు చేరిగారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో హరీష్ రావు ఆధర్మం వైపు నిలబడ్డారని విమర్శించారు. అలాగే హరీష్ రావు మద్యం, కుట్రలు, డబ్బు వైపు నిలబడ్డాడని ఆరోపించారు. అలాగే వీటి వల్లే హరీష్ రావు కు భవిష్యత్తు లో ఇబ్బందులు ఎదురు అవుతాయని అన్నారు.