రుణమాఫీ విషయంలో వెనకడుగు వేయం – డిప్యూటీ సీఎం భట్టి

-

నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పర్యటించారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం భట్టి మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో తమ ప్రభుత్వం వెనుకడుకు వేయదని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో చేయనట్లుగా తామూరు నమాఫీ చేశామన్నారు భట్టి విక్రమార్క. 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో 18 వేల కోట్లు వేశామని తెలిపారు. అర్హత ఉన్న రైతులు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. అలాగే పంటల బీమా ప్రీమియం ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. అలాగే త్వరలో వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపు సెట్లు పెట్టబోతున్నామని తెలిపారు.

ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 గ్రామాల్లో చేపట్టబోతున్నామన్నారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలతో కొందరికి రుణమాఫీ కాలేదని.. లక్ష రుణమాఫీ చేసేందుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల సమయం తీసుకుందని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఒకే దఫలో రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version