ఫోన్ ట్యాపింగ్ కేస్ అనేది తెలంగాణలో సంచనాలు సృష్టించింది అనే విషయం అందరికి తెలియసిందే. అయితే ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది అని వెస్ట్ జోన్ DCP తెలిపారు. ఈ కేసులో ఉన్న రాజకీయ నేతలను సైతం విచారిస్తాం. రాజకీయ నేతల వ్యవహారం పైన సాక్షాలను సేకరిస్తున్నాం అని పేర్కొన్నారు. అలాగే సాక్షాలు వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులను పిలిచి విచారిస్తాం. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశాం.. వాటిని కోర్టు పరిగణలోకి తీసుకుంది అని పేర్కొన్నారు.
అలాగే ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారు.. వాళ్ళని ఇండియాకు రప్పించే ప్రయత్నం కొనసాగుతున్నాయి. మా బృందాలు విదేశాల్లో ఉన్న వాళ్ళ రప్పించేందుకు ప్రయత్నించుతున్నాయి. ఈ విషయంలో కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ ను దాఖలు చేసాము అని DCP పేర్కొన్నారు.