బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలు మాని వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు.హన్మకొండ లో ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్ అబద్దాలు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు.ఉపాధి హామీ పనులు రాష్ట్రంలో మంచి పద్ధతి లోనే నడుస్తున్నాయని..ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని ఎర్రబెల్లి వివరించారు.
బండి సంజయ్ మొదటిబండి సంజయ్ మొదటినుంచి అబద్ధాలు మాట్లాడతారని ఆరోపించారు.బిజెపి నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉంటే..రాష్ట్రానికి ఏం తెచ్చారో ఒకటి చెప్పండని ఎర్రబెల్లి ప్రశ్నించారు.స్థానిక ఎంపీ గా ఉన్నప్పటికీ కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చుకోలేని స్థితిలో ఆయన ఉన్నారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నుంచి ఉపాధి హామీ డబ్బులు ఇవ్వలేదని బండి సంజయ్ ఆరోపించారు అన్నారు.అది వాస్తవమని..అయితే ఆ పథకానికి సంబంధించిన నిధులను కేంద్రమే కూలీల ఖాతాలో నేరుగా వేస్తోందని మంత్రి చెప్పారు.