కొత్త మంత్రులు వచ్చారు. వారి సంఖ్య 14 మంది.. పాతవారే 11 మంది.. మొత్తం 25..అయినా జగన్ తెలివిగా మరో ఇరవైదు మందికి అవకాశం ఇవ్వనున్నారు. వీరిని జిల్లాలకు సంబంధించి అభివృద్ధి మండళ్ల చైర్మన్లుగా నియమించనున్నారు. అంటే వీళ్లకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. మంత్రి హోదాలోనే వీళ్లంతా జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల, నియోజకవర్గాల పర్యటనల్లో తిరుగాడుతుంటారు.
ప్రస్తుతానికి వీరంతా జగన్ నోటిఫై చేసిన 26 జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నారు. ఆ విధంగా వీళ్లు వైసీపీ పనులు చక్కదిద్దుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీళ్లింకా యాక్టివ్ కాలేదు. అందుకు కారణంగా వీళ్లంతా జిల్లా అధ్యక్షులుగానో లేదా రీజనల్ కో ఆర్డినేటర్లుగానే ఉండడం వల్ల వీరు పార్టీకి ఉపయోగపడతారు సరే కానీ తరువాత మాకేంటి లాభం అన్న విధంగా ఉన్నారు. అందుకే పార్టీ పదవులు దక్కిన వారెవ్వరూ హ్యాపీ గా లేరు. పార్టీ పదవులు అందుకున్నా జిల్లా స్థాయిలో వీరు యాక్టివ్ కావడం అన్నది జరగని పని అని కూడా తేలిపోయింది. గతంలో చేసిన మంత్రులు అదేలేండి మాజీలు పదవీచ్యితులు అవ్వగానే ఇంటికే పరిమితం అయిపోయారు. కొందరు మాత్రం తెలివిగా తమ బాధ్యతల్లో కొంత భాగం తమ వారసులు చూసుకుంటారు అని చెప్పి తప్పుకుంటున్నారు.
ఆ విధంగా వీళ్లంతా ఎండలు కారణంగా ఇంటికే పరిమితం. ఇంకా చెప్పాలంటే పదవి లేని కారణంగా చాలా విషయాల్లో తమకు ప్రాధాన్యం ఎక్కువగా దక్కకపోవడం వల్ల ఇంటికే పరిమితం. ఇక త్వరలో గడగడపకూ వైస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంటే వీళ్లంతా సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి.. ఏ విధంగా ప్రభుత్వ పాలన ఉంది అన్నది తెలుసుకోవాలి.
క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్లి అడిగి రావాలి. కానీ సంక్షేమ ఫలాలు ఎంతమంది అందుకుంటున్నారు పోనీ అర్హులకే అన్నీ అందుతున్నా రాష్ట్ర జనాభా వీరి వాటా ఎంత? చాలా అంటే చాలా తక్కువ. మరి సంక్షేమ పథకాలు అందని వారు తిరుగుబాటు చేస్తే ఏమవ్వాలి? అందుకే మంత్రులకు భయం..ఎమ్మెల్యేలకూ భయం. ఎంపీలకూ భయం. సమాజంలో సంక్షేమం ఒక్కటే ప్రాథమిక హక్కు అని అనుకుంటే మిగిలిన మౌలిక వసతుల కల్పన కూడా ప్రాథమిక హక్కులే ! వాటిని వదిలి ఎలా ఉంటారని ? ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటారని?