జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్ట్ కు ఏం సంబంధం..? : డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో రైతు భరోసా ప్రకటన అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శలు గుప్పించారు. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై తాజాగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాాాాాాాాాాాాాాాాాాాా ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలకు ముందు రైతు భోసా కింద రూ.15వేలు ఇస్తామని.. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కేవలం రూ.12వేలు మాత్రమే ఇవ్వడం పై రైలను దగా చేయడమేనని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఆమె ఖండించారు. జైపాల్ రెడ్డికి పాలమూరు ప్రాజెక్టు కు సంబంధం ఏంటి..? అని ప్రశ్నించారు. పాలమూరు కోసం మా నాన్న అనేక పోరాటాలు చేసారని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కోసం మా మాన్న, సోదరుడు ప్రాణాలు అర్పించారని పేర్కోన్నారు డీ.కే.అరుణ్.

Read more RELATED
Recommended to you

Latest news