భర్తది ఏ కులం అయితే భార్యది అదే కులం.. బండి సంజయ్ కి జగ్గారెడ్డి కౌంటర్..!

-

కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్  ఏ కులం, మతమో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్  చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాంధీలపై బండి సంజయ్ తెలిసి మాట్లాడారా? తెలియక మాట్లాడారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర అని, స్వాతంత్ర్య సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారిదని వివరించారు. రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణులు, హిందువులు అని తెలిపారు. బ్రాహ్మణులు హిందువులు కారా? అని బండి సంజయ్కు ఏదైన డౌట్ ఉంటే ప్రశ్న అడగవచ్చని విమర్శించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గాంధీల కుటుంబం కులమతాలకు అతీతంగా ఉందని జగ్గారెడ్డి
అన్నారు. ఆయన కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదని చెప్పారు. దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం భర్తది ఏ కులమైతే.. భార్యది అదే కులం అవుతుందని వెల్లడించారు. హిందూ ధర్మంపై రాజకీయం చేసి, ఓట్లు అడిగి బతికే బండి సంజయ్క ఇది కూడా తెలియకపోతే ఎట్లా? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news