కడియం శ్రీహరి ప్రశ్నకు భట్టి సమాధానం ఏం చెప్పారంటే..?

-

రాబడి అనుకున్నంతగా లేదు.. అప్పు ఎక్కువగా చూపించారు. ఏ రకంగా ఉపయోగపడుతుందని కడియం శ్రీహరి అడిగిన ప్రశ్నకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో తాజాగా సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయ, వ్యవయాలకు సంబంధించిన అంశం అని.. మా ప్రయత్నమంతా చేశాం. సాధ్యమైనంత తెలంగాణ రాష్ట్రానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం.. ప్రియాంబుల్ (పీఠిక) స్పూర్తిగా గుర్తించాం అని తెలిపారు భట్టి. 

ఖర్చు చేసే ప్రతీ అంశంపై విధానంపై ముందుకు పోవాలనే ఆలోచనతోనే బడ్జెట్ తయారు చేశాం. పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం.. భావ ప్రకటన.. సమానత్వంగా చేకూర్చడానికి కేటాయించే ప్రతీ రూపాయిని సమానత్వం తీసుకొచ్చి.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసమే బడ్జెట్ తీసుకొచ్చామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మార్టిన్ లూథర్ కింగ్ ని ఎందుకు మెన్షన్ చేశామంటే.. తయారు చేసే బడ్జెట్ అందరికీ ఉపయోగపడాలనే మెన్షన్ చేశామని తెలిపారు.  

Read more RELATED
Recommended to you

Latest news