క్యాలెండర్ ప్రకారం ఇవాళ దీపావళి పర్వదినం అన్న సంగతి తెలిసిందే. అమావాస్య ఘడియలు రెండు రోజులు ఉండటంతో దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల 44 నిమిషాల నుంచి రేపు మధ్యాహ్నం రెండు గంటల 56 నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి.
దీంతో అమావాస్య సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇవాళ దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు పండితులు. ఇక రేపు కూడా అమావాస్య గడియలు ఉండటంతో ఆ రోజు… వైదిక క్షతువులు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. కాగా, దీపావళి పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్…తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించాలని కోరారు.