రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు శాసనసభలో స్వల్పకాలిక చర్చ

-

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి సభలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయం, వ్యయాలు, అప్పుల గణాంకాలను సభా వేదికగా ప్రజలకు తెలియజేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయనుంది.

కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని తయారు చేసింది. 2014 జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావం మొదలు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 2023 డిసెంబర్ ఏడో తేదీ వరకు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని ఆవిష్కరించేలా దీన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఖజానాకు వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, అన్ని రకాలుగా చేసిన ఖర్చు, తదితరాలకు సంబంధించిన గణాంకాలతో రూపొందించినట్లు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తీసుకున్న రుణాలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అప్పులమయం చేశారో వివరించాలన్న ప్రధాన ఉద్దేశంతో రేవంత్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version