హిందువుల పండుగలకే ఆంక్షలు ఎందుకు – బండి సంజయ్

-

గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందువుల పండుగలకే ఆంక్షలు, నిబంధనలు ఎందుకని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవమని.. తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజని గుర్తు చేశారు.

రజాకార్ల అరాచకాలని మనం ఎప్పుడూ మరచిపోలేమని అన్నారు బండి సంజయ్. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని విమర్శించారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భయపడి సెప్టెంబర్ 17న జరపడం లేదని విమర్శించారు.

వీరుల బలిదానాల్ని, త్యాగాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మరిచిపోతున్నాయని అన్నారు బండి. ఇక ఓవైసీ కాలేజీని హైడ్రా ఎప్పుడు కూల్చుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం అని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version