తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను చంపింది భార్య. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానీకుంట తండాలో ఘటన చోటు చేసుకుంది. లిక్కర్‌లో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగాలని భర్త బాలాజీకి చెప్పింది భార్య కాంతి. అప్పటికే కూల్‌డ్రింక్‌లో గడ్డి మందు కలిపింది భార్య.

భార్య మాట నమ్మి లిక్కర్‌లో కూల్‌డ్రింక్ కలుపుకుని తాగాడు భర్త. కాసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుపులు పెట్టాడు. ఇక భర్త చనిపోతాడని భావించి తన బావ ఇంటికి వెళ్లిపోయింది కాంతి. చుట్టుపక్కలవారు ఆసుపత్రికి తరలించగా.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఇక మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు భార్య కాంతి, బావ దశరులపై కేసు నమోదు చేశారు వర్ధన్నపేట పోలీసులు. ఇక పరారీలో ఉన్న కాంతి కోసం గాలిస్తున్నారు పోలీసులు.