భర్తలను చంపడం నేటి కాలంలో భార్యలకు ఫ్యాషన్ అయిపోయింది. రోజురోజుకు భర్తలను చంపిన భార్యల కేసులు అనేక రకాలుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహిళలు భర్తలను చంపడానికి ఏమాత్రం ఆలోచించకుండా హత్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కేసు వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్ పల్లి గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య అతికిరాతకంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దేశ్య నాయక్ (57) మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఖాళీగా చాలా కాలం నుంచి తిరుగుతూ ఉన్నాడు. మద్యం తాగి ఇంట్లో అనేకసార్లు గొడవలు చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఇటీవల శుక్రవారం రోజున కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో విసిగిపోయిన భార్య తన భర్తను కత్తితో దాడి చేసి గొంతులో పొడిచింది. వెంటనే స్థానికులు దేశ్య నాయక్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.